నిత్య కర్షకుడు.. ఈ కండక్టర్‌

Ideal Bus conductor ganesh with agriculture - Sakshi

ఓ వైపు ఉద్యోగం.. మరో వైపు వ్యవసాయం   

గెర్కిన్‌ పంట సాగుతో అధిక లాభాలు  

ఆదర్శంగా నిలుస్తున్న గణేష్‌

మంచాల:  బస్‌ కండక్టర్‌ ఉద్యోగం చేస్తూనే వ్యవసాయంలో రాణిస్తున్నాడు మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన లా లగారి గణేష్‌. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన గ ణేష్‌కు రెండు ఎకరాల భూమి ఉంది. అందులో ఏళ్లతరబడి వివిధ పంటలు సాగుచేసినా ఆశించిన దిగుబడి రాలేదు. దిగుబడి వచ్చినా ధర లేక కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉండేది. అ యినా ఆయన సాగు బాటను వదల్లేదు. మధ్యలో బస్‌ కండక్టర్‌ ఉ ద్యోగం వచ్చినా వ్యవసాయం మీద ఆశ చంపుకోలేదు. సాధారణ పంటలతో లాభం లేదనుకుని ఏదైనా ప్రత్యేక పంటను సాగు చే యాలని గణేష్‌ ఆలోచించాడు. ఏ పంట వేస్తే లాభాలు ఉంటాయ నే విషయంపై చాలా రోజులు పరిశీలన చేశాడు. ఆ  దశలో మా ర్కెట్లో మంచి డిమాండ్‌ ఉన్న గెర్కిన్‌ పంటపై ఆయన దృష్టిపడింది. దీంతో ఆ పంట సాగు వివరాలు తెలుసుకున్నాడు. సాగు కోసం విత్తనాలు సరఫరా చేసే కంపెనీ ప్రతినిధులను ఆశ్రయించాడు. వారు ఆరుట్లకు వచ్చి గణేష్‌ వ్యవసాయ భూమిని పరిశీలించారు. గ్లోబల్‌ గ్రీన్‌ కంపెనీ లిమిటెడ్‌ కంపెనీ వారు గెర్కిన్‌ పంట విత్తనాలు, క్రిమి సంహారక మందులు ఇవ్వడమే గాకుండా పంటను తామే కొనుగోలు చేస్తామని ఒప్పదం చేసుకున్నారు.                                     

120 రోజుల పంట...
గెర్కిన్‌∙ 120 రోజుల పంట. విత్తనాలు  నాటిన మూడు నాలుగు రోజుల్లో  మొలకలు వస్తాయి. 30 రోజుల వ్యవధిలో కాత వస్తుంది. మొదటి భీజం ఆకులు, పూత తీసి వేయాలి. అనంతరం వచ్చే కాతను కోసి మార్కెట్‌కు తరలించాలి. మొదట్లో ఎకరాకు ఐదు ను ంచి ఆరు క్విటాళ్ల దిగుబడి వస్తుంది. ఒకటి, రెండు కాతలు అనంతరం టన్ను వరకు వస్తుంది. గెర్కిన్‌ కాయలను కాసిన రెండవ రోజు కోసి మార్కెట్‌కు తరలించాలి. 120 రోజుల వ్యవధిలో 20కి పైగా కోతలు వస్తుంది. పంటను విత్తనాలు సరఫరా చేసిన కంపెనీ వారు కొనుగోలు చేస్తున్నారు. కాయ సైజును ఆధారంగా రేటు నిర్ణయిస్తారు.  ‘ఎ’ రకం 14ఎం.ఎం,  రూ.కిలో 30, ‘బి’ రకం 18 ఎం.ఎం. రూ.19, ‘సి’ రకం  25ఎం.ఎం. రూ.12, ‘డి’ రకం 33 ఎం.ఎం  రూ.04 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వారే కంపెనీ వాహనాల ద్వారా తోట వద్దకు వచ్చి పంట తీసుకెళ్తున్నారు.       

ఉద్యోగం చేస్తూనే..
గణేష్‌ కొన్ని సంవత్సరాలుగా బస్‌ కండక్టర్‌ ఉద్యోగం చేస్తూనే.. వ్యవసాయాన్ని కూడా చూసుకుంటున్నాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కండక్టర్‌ ఉద్యోగం చేస్తాడు. మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తాడు. సాగులో తన భార్య శోభ సహకారం అందిస్తోంది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందడమే కాకుండా పది మందికి జీవనోపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

లాభదాయకమైన సాగు
నాకు వ్యవసాయం అంటే మక్కువ. కండక్టర్‌ ఉద్యోగం వచ్చినా పంటల సాగు వదల్లేదు. గెర్కిన్‌ పంట చాలా లాభదాయకం. ఈ పంట సాగు చేయడం వల్లన 120 రోజుల వ్యవధిలో లక్ష రూపాయలు సంపాదించవచ్చు. ఈ పంటకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. విదేశాల్లో మందుల తయారీకి ఉపయోగిస్తారు. ప్రధానంగా ఉష్ణ మండల దేశాలకు ఎగుమతి అవుతుంది. నేను కష్టపడడమే కాకుండా నిత్యం పది మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది. – లాలగారి గణేష్, ఆరుట్ల

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top