తెలంగాణలో కరోనా వ్యాప్తి తక్కువే | ICMR Survey Coronavirus Spread Low In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కరోనా వ్యాప్తి తక్కువే

Jun 11 2020 3:14 AM | Updated on Jun 11 2020 3:15 AM

ICMR Survey Coronavirus Spread Low In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఎలా ఉందనే దానిపై ఐసీఎంఆర్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌)లు జరిపిన సీరం సర్వేల్లో రాష్ట్రంలో తీసిన శాంపిల్స్‌లో అతి తక్కువ మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. కరోనా వ్యాప్తి పరిశోధనల్లో భాగంగా తెలంగాణలో రూరల్, అర్బన్‌లో ప్రత్యేకంగా ఐసీఎంఆర్‌ ప్రివలెన్స్‌ సర్వే నిర్వహించాయి. ముందుగా మే నెల 15 నుంచి 17 వరకు రూరల్‌ ప్రాంతాలైన జనగాం, కామారెడ్డి, నల్లగొండలో ఒక్కో జిల్లాలో 400 శాంపిల్స్‌ చొప్పున మొత్తం 1,200 శాంపిల్స్‌ సేకరించారు. వీటిని పరిశీలించగా కేవలం 4 మాత్రమే పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అదేవిధంగా అర్బన్‌ ప్రాంతం హైదరాబాద్‌లోని 5 కంటైన్మెంట్‌ జోన్లు అయిన ఆదిభట్ల, టప్పాచబుత్ర, మియాపూర్, చందానగర్, బాలాపూర్‌లలో మే నెల 30, 31 తేదీల్లో సీరం సర్వే నిర్వహించారు. ఒక్కో జోన్‌లో 100 శాంపిల్స్‌ చొప్పున మొత్తం 500 శాంపిల్స్‌ సేకరించారు. వీటిని పరిశీలించగా కేవలం 15 మాత్రమే పాజిటివ్‌లుగా తేలాయి. లాక్‌డౌన్‌ విజయవంతంగా అమలు చేయడం వల్లనే కరోనా కట్టడి సాధ్యమైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. 

ఫేజ్‌–1 (మే 15 నుంచి 17 వరకు) 
జిల్లా           శాంపిల్స్‌       పాజిటివ్‌లు
జనగామ         400                   2 
కామారెడ్డి        400                   1 
నల్లగొండ       400                   1

Advertisement
 
Advertisement
Advertisement