సాధించాల్సింది చాలా ఉంది: కోదండరాం | I have to approach so many things, says professor kodandaram | Sakshi
Sakshi News home page

సాధించాల్సింది చాలా ఉంది: కోదండరాం

Feb 28 2015 2:23 AM | Updated on Sep 2 2017 10:01 PM

సాధించాల్సింది చాలా ఉంది: కోదండరాం

సాధించాల్సింది చాలా ఉంది: కోదండరాం

‘తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు... మహిళల భద్రత చట్టాలు లేవు...

- తెలంగాణ శాంతిదూత అవార్డు ప్రదానం


హన్మకొండ: ‘తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు... మహిళల భద్రత చట్టాలు లేవు...  అనేక సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ స్ఫూర్తితో మరిన్ని విజయాలను సాధించుకుందాం.’ అని జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. రాష్ర్టస్థాయి శాంతిదూతలుగా తెలంగాణ నుంచి కోదండరాం, ఆంధ్రప్రదేశ్ నుంచి కవి డాక్టర్ అద్దెపల్లి రాంమెహన్‌రావును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వాగ్దేవి విద్యాసంస్థల చైర్మన్ చందుపట్ల దేవేందర్‌రెడ్డిని జిల్లా శాంతిదూతగా ఎంపిక చేశారు.

శుక్రవారం రాత్రి హన్మకొండలో శాంతి దూత పురస్కారాలు ప్రదానం చేశారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ ఈ అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్, ప్రొఫెసర్ పాపిరెడ్డి, విద్యావేత్త చుక్కా రామయ్య, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement