లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? | I dare him to accept my challenge: lie-detector test | Sakshi
Sakshi News home page

లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా?

Jun 8 2015 6:39 AM | Updated on Jul 28 2018 6:48 PM

లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? - Sakshi

లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా?

లైడిటక్టర్ పరీక్షలకు నేను సిద్ధం..దమ్ముంటే నువ్వు సిద్దమా అని తెలంగాణ మంత్రి కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు.

హైదరాబాద్: 'నా పై చేస్తున్న ఆరోపణలకు టీవీ ఎదుట లైడిటక్టర్ పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధం. .ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమా' అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడుస్తున్న సమస్యకాదని ఆయన స్పష్టం చేశారు.  అలా సృష్టించే ప్రయత్నం చంద్రబాబు,  ఆయన మనుషులు చేస్తున్నారు. చంద్రబాబు, టీడీపీ అవినీతి చేష్టలు బట్టబయలు అయ్యాయి. దమ్ముంటే నా సవాల్ ను చంద్రబాబు స్వీకరించాలి అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్టీఫెన్ సన్ తో చంద్రబాబు జరిపిన ఆడియో టేపులు బట్టబయలైన నేపథ్యంలో కేటీఆర్ ఈ సవాల్ విసిరారు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement