తిరిగి కాంగ్రెస్‌లో చేరడం అవాస్తవం: డీఎస్‌ | I am Not joining Congress : DS | Sakshi
Sakshi News home page

తిరిగి కాంగ్రెస్‌లో చేరడం అవాస్తవం: డీఎస్‌

Aug 4 2017 1:54 AM | Updated on Mar 18 2019 7:55 PM

తిరిగి కాంగ్రెస్‌లో చేరడం అవాస్తవం: డీఎస్‌ - Sakshi

తిరిగి కాంగ్రెస్‌లో చేరడం అవాస్తవం: డీఎస్‌

తాను తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నానని వస్తున్న వార్తలు అవాస్తమని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో మాట్లా డుతూ..

సాక్షి, న్యూఢిల్లీ: తాను తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నానని వస్తున్న వార్తలు అవాస్తమని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో మాట్లా డుతూ.. తన సూచన మేరకే దిగ్విజయ్‌ను తెలంగాణ ఇన్‌చార్జ్‌ వ్యవహారాల నుంచి సోనియాగాంధీ తొలగించారనడం అవాస్త వమని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తాను టీఆర్‌ఎస్‌లో గౌరవంగా ఉన్నా నని, సీఎం కేసీఆర్‌కు.. తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. తన హోదాకు తగ్గట్టు కేసీఆర్‌ గౌరవిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ అన్యాయానికి గురైందని తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే చెప్పానన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే కాంగ్రెస్‌ లేనిపోని విమర్శలు చేస్తోందని డీఎస్‌ మండిపడ్డారు. కేసీఆర్‌ పాలనలో బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement