స్పందించిన పోలీస్‌ హృదయం

Hyderabad Police Helps Patient in Heavy Rain - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: వర్షం నీటిలో చిక్కుకున్న ఓ రోగిని..స్వయంగా తన భుజాలపై మోస్తూ సురక్షిత ప్రాంతానికి తరలించాడో ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌. శుక్రవారం భారీ వర్షం కారణంగా ఎల్బీనగర్‌ నుంచి సాగర్‌ రింగ్‌ రోడ్డు వెళ్లే దారిలో వర్షపు నీరు నిలిచిపోయింది. అదే సమయంలో ఓ వ్యక్తి అనారోగ్యానికి గురైన తన తండ్రిని తీసుకుని బండిపై వెళ్తుండగా...మధ్యలోనే టూ వీలర్‌ ఆగిపోయింది. అక్కడే ఉన్న ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగమల్లు విషయం గమనించి ఆ రోగిని తన భుజాలపై మోస్తూ సురక్షిత ప్రాంతానికి చేర్చాడు. ఇది గమనించిన స్థానికులు వీడియో తీసి వైరల్‌ చేశారు. సీఐ మానవతా హృదంతో స్పందించిన తీరును పలువురు ప్రశంసించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top