ఆన్‌లైన్‌లోనే..

Hyderabad People Using Smartphone While Sleeping Time - Sakshi

మారుతున్న గ్రేటర్‌ వాసుల హాబీలు

50 శాతం మందికి పైగా సోషల్‌ మీడియాలోనే..  

‘మింట్‌ గౌ’ సంస్థ తాజా సర్వేలో వెల్లడి

5 వేల మంది నుంచి అభిప్రాయాల సేకరణ

సాక్షి,సిటీబ్యూరో: నగరవాసుల హాబీలు మారుతున్నాయి. ఒకప్పుడు శారీరక శ్రమతో పాటు వ్యాయామానికి సంబంధించిన ఆటలు హాబీలుగా ఉండేవి. వాటి తర్వాత  ఫొటోగ్రఫీ, ఆర్ట్, గార్డెనింగ్, మ్యూజిక్‌ వినడం, బుక్‌ రీడింగ్‌ వంటి వ్యాపకాల్లో గడిపేవారు. కానీ స్మార్ట్‌ఫోన్‌.. అపరిమిత ఇంటర్‌నెట్‌ అందుబాటులోకి వచ్చాక గ్రేటర్‌ సిటీజనుల్లో అధిక శాతం మంది హాబీలు మారిపోతున్నాయి. ప్రస్తుతం ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా ‘సోషల్‌ మీడియా’లోనే విహరిస్తున్నారు.

ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా నాలుగు గంటలకు పైగా అదే ప్రపంచంగా గడుపుతున్నారు. ఇలాంటి వారు మహానగరంలో 56 శాతానికి పైగా ఉన్నట్లు ‘మింట్‌ గౌ’ అనే సంస్థ     తాజా అధ్యయనంలో వెల్లడైంది. గ్రేటర్‌ సిటీలో ప్రధానంగా 18–21 ఏళ్ల మధ్య వయసు యువతలో 56.99 శాతం మంది తాము నాలుగు గంటలకు పైగా ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో జీవిస్తున్నట్టు ఈ సర్వే వెల్లడించింది. ఇక 22–29 మధ్య వయస్కులు 56.87 శాతం మంది.. 29–37 మధ్య వయస్సున్న వారు 54.56 శాతం, 38–53 ఏళ్ల మధ్యనున్న వారిలో 55.65 శాతం మంది సోషల్‌ మీడియానే తమ వ్యాపకంగా సెలవిచ్చారట. ఇటీవల ‘మింట్‌గౌ’ గ్రేటర్‌ వాసుల హాబీలపై ఆన్‌లైన్‌లో చేయగా దాదాపు ఐదు వేలమంది తమ అభిప్రాయాలను సిన సర్వే వివరాలను తాజాగా ప్రకటించింది.

ఫిట్‌నెస్‌పైనా పెరిగిన శ్రద్ధ..
గ్రేటర్‌లో సోషల్‌ మీడియాలో మునిగితేలుతున్న యువత తమ బాడీ ఫిట్‌నెస్‌కు సైతం అధిక ప్రాధాన్యఇ ఇనిస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఎవరి తీరికను బట్టి వారు జిమ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్, వాకింగ్, పవర్‌ యోగా, యోగా వంటి వ్యాపకాలకు కొంత సమయం వెచ్చిస్తున్నట్లు తేలింది. ఇక తమ మిత్ర బృందంతో గడిపేందుకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారట. 

కొలువు చేస్తున్న వారు సైతం..
ఐటీ, బీపీఓ, కేపీఓ తదితర వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు, వ్యాపారాలు చేసుకునే వారిలో సైతం అత్యధికులు  సోషల్‌ మీడియాలోనే విహరిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఉద్యోగం చేస్తున్న వారిలో 54 శాతం మందికి.. చదువుకుంటున్న వారిలో 65 శాతం మందికి ఏదో వ్యాపకం ఉందట. అందులోనూ ఏకంగా 50 శాతం మంది ఇంటర్నెట్, సోషల్‌ మీడియాలే తమ హబీలని సెలవివ్వడం గమనార్హం.  

ఇతర హాబీలు అంతంతే..
తీరిక వేళల్లో వంటచేయడం, ఫోటోగ్రఫీ, సంగీత సాధన, గార్డెనింగ్, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ వంటి వ్యాపకాలతో గడిపేవారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. వంట చేయడం హాబీ అని తెలిపిన పురుషులు 26.55 శాతం మంది ఉండడం విశేషం. ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ ఇష్టమని చెప్పిన పురుషులు 12.07 శాతం కాగా.. గార్డెనింగ్, సంగీత సాధన, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ వంటి విషయాల్లో పురుషుల కంటే మహిళలే ముందున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top