సిటీ.. టీనేజ్‌ పిటీ

Hyderabad Lagging in Teenage Women Requirements - Sakshi

దేశంలోని 7 ప్రధాన నగరాలతో పోల్చినప్పుడు టీనేజి యువతుల అవసరాలు తీర్చడంలో మన నగరం వెనుకబడి ఉన్నట్టు తేలింది. నగరానికి చెందిన నాంది ఫౌండేషన్‌ నిర్వహించిన సర్వేలో ముంబయి టాప్‌లో ఉంటే మన సిటీ 6వ స్థానంలో, చెన్నై మనకన్నా వెనుకబడిపోయింది. టీనేజ్‌ గర్ల్‌ ఇండెక్స్‌ (టీఏజీ) ఆధారంగా 13 నుంచి 19 ఏళ్ల మధ్య వయసువారిపై ఈ సర్వే నిర్వహించారు. యువతుల విద్య, పెళ్లి వయసు, వారి ఆకాంక్షలు, పారిశుధ్యం, పరిశుభ్రత... వంటి అంశాలను దీని కోసం పరిశీలించారు.

చదువుకుంటున్న టీనేజ్‌ యువతుల వందశాతంకు చేరువలో ఉన్నప్పటికీ.. స్కూల్‌/కాలేజ్‌లకు వెళ్లడానికి సవాళ్లను ఎదుర్కోని వారి విషయానికి వస్తే మాత్రం అది 59.4శాతంగా ఉంది. ఇప్పటికీ బహిరంగంగా కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన పరిస్థితిలో 11శాతం మంది అమ్మాయిలు ఉండటం బాధకరం. అదే సమయంలో 16శాతం మందికి బహిష్టు సమయంలో పాటించాల్సిన పరిశుభ్రమైన పద్ధతులు తెలియవు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కేవలం 43.7 శాతం మంది మాత్రమే సాధారణమైన బాడీ మాస్‌ ఇండెక్స్‌(బీఎమ్‌ఐ) కలిగి ఉన్నారు. మరో 55శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునే విషయంలో 43.6శాతం ఉండగా, కంప్యూటర్‌ వినియోగం, సోషల్‌ మీడియాను ఉపయోగించుకోవడం, ఒంటరిగా దూర ప్రయాణాలు, ఒంటరిగా నివసించగలగడం.. వంటి న్యూ ఏజ్‌ స్కిల్స్‌ విషయంలో కేరళ ప్రథమ స్థానంలో తెలంగాణ 19వ స్థానంలో ఉందని తేల్చింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top