భార్యను నరికి చంపిన భర్త | Husband Killed Wife for Suspicion | Sakshi
Sakshi News home page

భార్యను నరికి చంపిన భర్త

Jun 30 2015 1:17 AM | Updated on Sep 3 2017 4:35 AM

భార్యను నరికి చంపిన భర్త

భార్యను నరికి చంపిన భర్త

అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానంతో ఓ కిరాతకుడు కత్తితో నరికి చంపాడు...

అనుమానంతో అమానుషం...
అత్తాపూర్:
అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానంతో ఓ కిరాతకుడు కత్తితో నరికి చంపాడు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఉమేందర్ కథనం ప్రకారం... సిక్‌చౌహాని ప్రాంతానికి చెందిన షఫియాబేగం(25), గౌస్ భార్యాభర్తలు. తొమ్మిదేళ్ల క్రితం వీరికి పెళ్లైంది. నలుగురు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై భార్యతో ఐదురోజులుగా గొడవపడుతున్న గౌస్ ఎలాగైన ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న షఫియాతో గొడపడి, కత్తితో మెడపై నరికి చంపి పారిపోయాడు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీ సులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి,  గౌస్ కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement