భార్యకు ఉరి వేసిన భర్త | Husband hanged wife | Sakshi
Sakshi News home page

భార్యకు ఉరి వేసిన భర్త

Oct 1 2015 5:29 PM | Updated on Jul 27 2018 2:18 PM

తాగిన మత్తులో భార్య గొంతు పిసికి ఉరేశాడో తాగుబోతు భర్త.

తాగిన మత్తులో భార్య గొంతు పిసికి ఉరేశాడో తాగుబోతు భర్త. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలం సింగరాయపల్లి గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన రాంచందర్(38), బుజ్జమ్మ(30)లు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో మద్యానికి బానిసైన రాంచందర్ బుధవారం రాత్రి పీకల దాకా తిగి వచ్చి నిద్రిస్తున్న భార్యను గొంతు నులిమి చీరతో ఉరేసి హతమార్చాడు. ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారించగా.. తనే ఆత్మహత్య చేసుకుందని బుకాయించాడు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement