వేటగాళ్లు అరెస్ట్: నాటు తుపాకి స్వాధీనం | hunters arrested in adilabad district | Sakshi
Sakshi News home page

వేటగాళ్లు అరెస్ట్: నాటు తుపాకి స్వాధీనం

May 15 2016 10:39 AM | Updated on Aug 20 2018 4:44 PM

ఆదిలాబాద్ జిల్లాలోని మామడ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఆదివారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని మామడ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు ఆదివారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జంతువులను వేటాడుతున్న ఆరుగురు వ్యక్తులను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నాటు తుపాకి,జీపు, కారు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement