చైతన్యపురిలో భారీ చోరి | huge robbery in chaitanyapuri | Sakshi
Sakshi News home page

చైతన్యపురిలో భారీ చోరి

May 1 2015 12:48 PM | Updated on Sep 3 2017 1:14 AM

ఇంట్లోవాళ్లంతా నిద్రిస్తున్న సమయంలో దొంగలు తెగబడ్డారు.

హైదరాబాద్:ఇంట్లోవాళ్లంతా నిద్రిస్తున్న సమయంలో దొంగలు తెగబడ్డారు. చడి చప్పుడు కాకుండా ఇంట్లో ఉన్న 85 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ సంఘటన నగరంలోని చైతన్యపురి పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మలక్‌పేట్ మార్కెట్‌లో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ప్రభాకర్ అనే వ్యాపారి ఇంట్లో ఈ చోరి జరిగింది. గురువారం అర్థరాత్రి  ఇంట్లో చొరబడిన దొంగలు 85 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. చోరి జరిగిన విషయం శుక్రవారం ఉదయం గుర్తించిన ప్రభాకర్ పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement