పత్తి పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం | hude fire accident in Cotton mill | Sakshi
Sakshi News home page

పత్తి పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

Mar 20 2015 9:47 AM | Updated on Sep 5 2018 9:45 PM

పత్తి పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం - Sakshi

పత్తి పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

నల్లగొండ జిల్లా చిట్యాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

నల్లగొండ : నల్లగొండ జిల్లా చిట్యాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌సర్క్కూట్‌తో మంటలు చెలరేగి పత్తి పరిశ్రమలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు..మండలంలోని శ్రీకృష్ణా కాటన్ మిల్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పరిశ్రమలోని పత్తి బేళ్లకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 30 వేల క్వింటాళ్ల పత్తి కాలి బూడిదైనట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. దీంతో సుమారుగా రూ. 10 కోట్ల విలువైన పత్తి కాలిపోయిందని వారు వాపోయారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
(చిట్యాల)
 

Advertisement
 
Advertisement
Advertisement