హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం | Hostel student attempts suicide | Sakshi
Sakshi News home page

హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Nov 23 2015 4:10 PM | Updated on Mar 28 2018 11:11 AM

ప్రభుత్వ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థిని ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

మేడ్చల్ (రంగారెడ్డి) : ప్రభుత్వ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థిని ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ప్రభుత్వ పాఠశాల వసతి గృహంలో సోమవారం చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నంకు చెందిన శివాని(14) స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.

ఈ క్రమంలో సోమవారం ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన తోటి విద్యార్థులు హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విద్యార్థినిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యాయత్నం చేసి ఉంటుందని తోటి విద్యార్థినులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement