
సాక్షి, హైదరాబాద్ : షైన్ ఆసుపత్రి ఘటనపై హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదం జరగడంలో నిర్లక్ష్యం వహించిన ఎండీ సునీల్ కుమార్‌రెడ్డి, ఇతర సిబ్బందిని ఎల్బీ నగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నిందితులను హైకోర్టులో హాజరు పరిచిన పోలీసులపై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఫైర్ యాక్సిడెంట్ అయి ఒక చిన్నారి ప్రాణం కోల్పోతే నిందితులపై 304ఎ బెయిలబుల్ కేసు ఎలా నమోదు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు 304 ఏ సెక‌్షన్‌ను 304 పార్ట్ 2 గా మార్చి నిందితులను రిమాండ్‌కు తరలించారు.
(చదవండి : షైన్ ఆసుపత్రి సిబ్బంది అరెస్ట్)