వినియోగదారుల ఫోరాల్లో  మహిళా సభ్యులు లేరు: హైకోర్టు | High Court Questions The TRS Government Over Consumer Forum For Women | Sakshi
Sakshi News home page

వినియోగదారుల ఫోరాల్లో  మహిళా సభ్యులు లేరు: హైకోర్టు

Sep 22 2019 3:05 AM | Updated on Sep 22 2019 3:05 AM

High Court Questions The TRS Government Over Consumer Forum For Women - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర, జిల్లా వినియోగదారుల ఫోరాల్లో మహిళా సభ్యులు ఒక్కరు కూడా లేకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియజేయాలని హైకోర్టు వివరణ కోరింది. రాష్ట్ర వినియోగదారుల ఫోరం 12 జిల్లాల్లోని వినియోగదారుల ఫోరాల్లో ఖాళీగా ఉన్న 24 మంది మహిళా సభ్యుల పోస్టులు భర్తీ చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ కరీంనగర్‌ వినియోగదారుల మండలి అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాస్‌ పిల్‌ దాఖలు చేశారు. ఫోరాల్లో మహిళా సభ్యుల నియామకాల భర్తీ విషయంపై వివరణ ఇవ్వాలని శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది.

Advertisement
 
Advertisement
Advertisement