
సాక్షి, హైదరాబాద్: రాగల మూడురోజులు రాష్ట్రంలో అనేకచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలలో నేడు, రేపు ఒకటిరెండుచోట్ల, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రాగల 24 గంటలలో ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
వివిధ ప్రాంతాలలో నమోదైన వర్షపాతం:
సుల్తానాబాద్ (పెద్దపల్లి) 8 సెం.మీ, జోగిపేట్ (సంగారెడ్డి) 7 సెం.మీ, దుమ్ముగూడెం(భద్రాద్రి కొత్తగూడెం), పరకాల (వరంగల్ రూరల్), ఎంకూరు (ఖమ్మం), కరీంనగర్, దండెపల్లి (మంచిర్యాల), ఆర్మూర్ (నిజామాబాద్)లో 6 సెం.మీ, కొండాపూర్ (సంగారెడ్డి), నేరేడ్‌చర్ల (సూర్యాపేట్), నర్మెట్ట (జనగాం), కాళేశ్వరం (జయశంకర్ భూపాలపల్లి), పెద్దేముల్ (వికారాబాద్), నందిపేట్ (నిజామాబాద్)లలో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.