బీబీనగర్‌లో భారీ వడగండ్ల వాన | heavy rain in yadadri | Sakshi
Sakshi News home page

బీబీనగర్‌లో భారీ వడగండ్ల వాన

Mar 7 2017 4:57 PM | Updated on Sep 5 2017 5:27 AM

బీబీనగర్‌లో భారీ వడగండ్ల వాన

బీబీనగర్‌లో భారీ వడగండ్ల వాన

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో మంగళవారం సాయంత్రం భారీ వడగండ్ల వాన కురిసింది.

బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో మంగళవారం సాయంత్రం భారీ వడగండ్ల వాన కురిసింది. ఏకధాటిగా వాన  పడటంతో రోడ్లపై ఉన్న జనం తలదాచుకునేందుకు తలోదిక్కు పరుగులు తీశారు. అరగంట పాటు కురిసిన వానతో మండల కేంద్రంలో తెల్లటి మంచు కప్పినట్లయింది.

మరోవైపు మంగళవారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణం మారిపోయింది. ఎండ తీవ్రత తగ్గి చలిగాలులు వీచాయి. కాగా  తెలంగాణ రాష్ట్రంలో చాలాచోట్ల వర్షాలతో పాటు వడగండ్లు పడ్డాయి. దీంతో చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement