ఆర్థిక ఇబ్బందులతో నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన నేత కార్మికుడు జెల్ల కుమారస్వామి బలవన్మరణం చెందాడు.
	ఆర్థిక ఇబ్బందులు నేతన్న ఉసురుతీశాయి. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన నేత కార్మికుడొకరు అప్పుల బాధతో బలవన్మరణం చెందాడు. గ్రామంలో నేతపని చేసుకునే జెల్ల కుమారస్వామి(49) సరైన పని దొరక్క కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు. కుటుంబ పోషణ కోసం అతడు రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ విషయమై తీవ్ర మనోదనతో ఉన్న కుమారస్వామి మంగళవారం రాత్రి నేత పనిలో వాడే నైటాఫ్ అనే రసాయనాన్ని తాగాడు. బుధవారం ఉదయం అతడు మృతి చెందిన విషయాన్ని కుటుంబసభ్యులు గమనించారు. అతనికి భార్య అలివేలు, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు ఎస్సై రాజశేఖర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
	చేనేత కార్మికుడు, ఆత్మహత్య, నల్లగొండ, నైటాఫ్, రుణ భారం, The handloom worker , suicide , Nalgonda , naitaph , debt , Weaver,

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
