సప్లిమెంటరీకి 200 మంది విద్యార్థులు దూరం | hall tickets not issued to inter students | Sakshi
Sakshi News home page

సప్లిమెంటరీకి 200 మంది విద్యార్థులు దూరం

May 25 2015 11:37 AM | Updated on Jun 2 2018 3:08 PM

సప్లిమెంటరీకి 200 మంది విద్యార్థులు దూరం - Sakshi

సప్లిమెంటరీకి 200 మంది విద్యార్థులు దూరం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రారంభమైన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 200 మంది విద్యార్థులు దూరమయ్యారు.

హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రారంభమైన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 200 మంది విద్యార్థులు దూరమయ్యారు. వారికి హాల్ టికెట్లు రాకపోవడంతో పరీక్షలకు హాజరుకాలేకపోయారు. అయితే, వారు ఫీజుల కట్టకపోవడం వల్లే హాల్ టిక్కెట్లు పంపించలేదని ఇంటర్ బోర్డు అధికారులు చెప్తున్నారు. దీంతో సోమవారం ఉదయం తెలంగాణ ఇంటర్ బోర్డు వద్ద ఏబీవీపీ సంఘాలు ఆందోళనకు దిగాయి. 

పరీక్షలు ప్రారంభమైనా అధికారులు చోద్యం చూస్తున్నారని, విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతో వారి ఏడాది భవిష్యత్ నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు దరఖాస్తులు అపలోడ్ చేస్తుంటే సాంకేతిక లోపం కూడా తలెత్తిందని చెప్పారు. వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని వారికి కూడా హాల్ టికెట్లు ఇచ్చి పరీక్షకు అనుమతించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement