కోమటిరెడ్డి.. ప్రజల్లోనే తేల్చుకుందాం రా... | Gutta sukhendarreddi challenged to Komatireddy Venkata Reddy | Sakshi
Sakshi News home page

కోమటిరెడ్డి.. ప్రజల్లోనే తేల్చుకుందాం రా...

Oct 17 2016 1:38 AM | Updated on Aug 29 2018 4:18 PM

కోమటిరెడ్డి.. ప్రజల్లోనే తేల్చుకుందాం రా... - Sakshi

కోమటిరెడ్డి.. ప్రజల్లోనే తేల్చుకుందాం రా...

నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. నేనూ ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.

నల్లగొండ ఎంపీ గుత్తా సవాల్
నల్లగొండ: ‘నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. నేనూ ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. ఇద్దరం ఎన్నికలకెళ్దాం. ప్రజలెవర్ని ఆమోదిస్తరో తెలుస్తది’ అని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సవాల్ విసిరారు. ఆదివారం నల్లగొండలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు.

విచక్షణ కోల్పోయి కోమటిరెడ్డి ఎప్పుడేం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడంలేదన్నారు. ఏనాడూ నాగలి పట్టని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క... నేడు వైఎస్ వేషధారణలో ట్రాక్టర్‌తో రోడ్ల మీదకు వచ్చి ప్రజల మెప్పు కోసం ఆరాటపడుతున్నారన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement