ఉద్యోగులు ధైర్యంగా ఉండండి: నారాయణ

Govt Is Creating A Civil War Between RTC Workers And Temporary Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణా రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల ఉద్యమం మరువలేనిదనీ, అలాంటి కార్మికులను ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించి.. నియంతలా పాలన చేపడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ప్రభుత్వం తాత్కాలికంగా నియమించిన ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య అంతర్యుద్ధం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగులు ధైర్యంగా ఉండాలని నారాయణ కోరారు. చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగి కుటుంబానికి కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. అంతేకాక వారి పిల్లలకు ఉద్యోగాలతో పాటు ఉండేందుకు ఒక ఇల్లు ఇవ్వాలని, ఇదంతా తెలంగాణ ప్రభుత్వ బాధ్యత అని అభిప్రాయపడ్డారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top