
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా సింగరేణి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎండీ శ్రీధర్‌కు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ ‘ఔట్ స్టాండింగ్ గ్లోబల్ లీడర్‌షిప్’ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఎకనామిక్ సమ్మిట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీతాసింగ్ శ్రీధర్‌కు లేఖ రాశారు. 28న దుబాయిలో జరగనున్న గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్‌లో అవార్డు, సింగరేణి సంస్థకు గోల్డ్ మెడల్ అందించనున్నారు. అవార్డు ప్రకటించడం పట్ల శ్రీధర్ సంతోషం వ్యక్తం చేశారు.