రవిచంద్రను భారీ మెజార్టీతో గెలిపించాలి: వి.హనుమంతరావు | Give Full Majority To Ravichandra In Warangal said v hanumantha rao | Sakshi
Sakshi News home page

రవిచంద్రను భారీ మెజార్టీతో గెలిపించాలి: వి.హనుమంతరావు

Dec 2 2018 3:49 PM | Updated on Sep 19 2019 8:28 PM

Give Full Majority To Ravichandra In Warangal said v hanumantha rao - Sakshi

రోడ్‌షోలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌  నాయకుడు హనుమంతరావు, అభ్యర్థి రవిచంద్ర  

    సాక్షి, ఖిలా వరంగల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం సర్వముఖోభివృద్ధి జరిగిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. వరంగల్‌ పోచమ్మమైదానంలో కాంగ్రెస్‌ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్ధి వద్ది రాజు రవిచంద్ర ఆధ్వర్యంలో శనివారం రాత్రి రోడ్‌షో జరిగింది. ముఖ్యఅతిథిగా హనుమంతరావు హాజరై రోడ్‌షోలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.  కుటుంబ పాలన చేస్తూ రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టిన ఘనత కేసీఆర్‌దేనిన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీలు, ఫెన్షన్ల రెట్టింపు, ఏడుకేజీల సన్నబియ్యం, విద్యార్థుల చదువులకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌తోపాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పట్టనున్నట్లు తెలిపారు.

చేతి గుర్తుకు ఓటు వేసి వద్ది రాజు రవిచంద్రను భారీ మేజార్టీతో గెలిపించాని ఆయన కోరారు. అనంతరం రవిచంద్ర మాట్లాడుతూ తాను స్థానికుడినేనని, మున్నూరుకాపు బిడ్డను ఆదరించాలని కోరారు. చేతిగుర్తుకు ఓటు వేసి భారీ మేజార్టీని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆనంతరం రోడ్‌ షో పోచమ్మమైదానం నుంచి వరంగల్‌ చౌరస్తా, అండర్‌ బ్రిడ్జి, ఫోర్ట్‌రోడ్డుమీదుగా శంభునిపేట, ఆర్టీఏ జంక్షన్‌ వరకు సాగింది. రోడ్‌షోకు కాంగ్రెస్‌ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంబాడి రవీందర్, మీసాల ప్రకాశ్, ఎండీ ఆయూబ్, రాజు, కొత్తపెల్లి శ్రీనివాస్, కరాటే ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement