ప్రియురాలి ఫిర్యాదుతో ఆగిన ప్రియుడి పెళ్లి | girlfriend complaint against lover, police case filed cheating lover | Sakshi
Sakshi News home page

ప్రియురాలి ఫిర్యాదుతో ఆగిన ప్రియుడి పెళ్లి

Mar 1 2017 12:45 PM | Updated on Aug 21 2018 8:23 PM

ప్రియురాలి ఫిర్యాదుతో ఆగిన ప్రియుడి పెళ్లి - Sakshi

ప్రియురాలి ఫిర్యాదుతో ఆగిన ప్రియుడి పెళ్లి

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు వేరే యువతిని వివాహం చేసుకుంటున్నాడనే విషయం తెలిసి ప్రియురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది.

గొల్లపల్లి(జగిత్యాల): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు వేరే యువతిని వివాహం చేసుకుంటున్నాడనే విషయం తెలిసి ప్రియురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రియుడి పెళ్లిని నిలిపివేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో బుధవారం వెలుగు చూసింది.  వివరాల్లోకి వెళితే.... కొడిమ్యాల మండలం రామకృష్ణాపూర్‌ గ్రామానికి చెందిన దీప(24)కు ఓ ఫోటో స్టూడియోలో నాలుగేళ్ల క్రితం తూర్పాటి కుమార్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచింది. నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న దీపను కాదని కుమార్‌ మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. గుట్టుచప్పుడు కాకుండా గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని ఇవాళ పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు.  ఈ విషయాన్ని కుమార్‌ స్నేహితుల ద్వారా తెలుసుకున్న దీప ‘తనను అన్ని విధాలుగా వాడుకొని చివరకు పెళ్లి చేసుకోకుండా.. వేరే అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నాడని’ గొల్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement