బోరుబావిలో బాలిక | Girl in bore well | Sakshi
Sakshi News home page

బోరుబావిలో బాలిక

Jun 23 2017 2:02 AM | Updated on Sep 5 2017 2:14 PM

బోరుబావిలో బాలిక

బోరుబావిలో బాలిక

19 నెలల చిన్నారి. సరదాగా ఆడుకుంటూ ఉన్నట్టుండి బోరుబావిలో పడిపోయింది.

► రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘటన
► కాపాడేందుకు కొనసాగుతున్న చర్యలు


చేవెళ్ల: 19 నెలల చిన్నారి. సరదాగా ఆడుకుంటూ ఉన్నట్టుండి బోరుబావిలో పడిపోయింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెల్లి పంచాయతీ పరిధిలో ని ఇక్కారెడ్డిగూడెంలో గురువారం సాయంత్రం 6.30కి ఈ సంఘటన జరిగింది. వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం గోరెపల్లికి చెందిన యాదయ్య, రేణుక దంపతులు బతుకుదెరువు కోసం చేవెళ్ల మండలానికి వలస వచ్చారు. వారు స్థానిక పాలీహౌస్‌లో పనిచేస్తున్నారు. వీరికి అక్షిత, చిన్నారి ఇద్దరు కూతుళ్లు.

గురువారం సాయంత్రం చిన్నారి పాలీహౌస్‌ పక్కనే ఆడుకుంటూ మల్లారెడ్డి అనే వ్యక్తికి చెందిన పొలంలోని బోరుబావి వద్దకు వెళ్లి అందులో పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు మొదలుపెట్టారు. బోరు బావికి సమాంతరంగా పొక్లెయిన్‌తో గుంత తవ్వుతున్నారు. బోరులోకి ఆక్సిజన్‌ పంపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement