నల్లగొండలో దారుణం.. పసికందు మృతి | girl child appear at croplands in nalgonda district | Sakshi
Sakshi News home page

నల్లగొండలో దారుణం.. పసికందు మృతి

Jan 1 2016 12:36 PM | Updated on Aug 21 2018 7:18 PM

నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలం కోమటికుంట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.

నేరేడుచర్ల(నల్లగొండ): నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలం కోమటికుంట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ శివారులోని పంటపొలాల్లో వదిలి వెళ్లారు. శుక్రవారం ఉదయం ఇది గుర్తించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ శిశువును ఆస్పత్రికి తరలించారు. కాగా.. అప్పటికే శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శిశువుకు సంబంధించిన వాళ్ల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement