దోమలపై ‘స్మార్ట్‌’ ఫైట్‌

GHMC Measures To Control Mosquitoes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:మస్కీట్‌.. ఇది దోమల నివారణ యంత్రం. దోమలు నగరంలో ఏయే ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి.. ఏ రకం దోమ వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి.. అనే వివరాలు తెలుసుకు నేందుకు జీహెచ్‌ఎంసీ దీన్ని వినియోగించనుంది. క్యాచ్, కౌంట్, క్లాసిఫ్‌ అనే మూడు పనులను ఈ పరికరం చేస్తుంది. మెషీన్‌లోని సువాసనలతో కూడిన లిక్విడ్, సెన్సర్ల వల్ల దోమలు దీంట్లోకి వస్తాయి. దీంతో ఆయా వాటిలోని దోమలను వర్గీకరించి.. ఫలానా వ్యాధిని కలిగించే దోమలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. తద్వారా సదరు ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టవచ్చు. నిరోధక చర్యలు చేపట్టాక ఏ మేరకు దోమలు తగ్గాయో కూడా తెలుసుకోవచ్చు. నగరంలో జోన్‌కొకటి వంతున దీన్ని వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. దీని వ్యయం రూ.60 వేలని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top