breaking news
mosqito problems
-
6,00,000 దోమలను నగరంలో వదులుతున్నారు.. ఎందుకంటే?
వాషింగ్టన్ డీసీ: దోమల సంఖ్యను తగ్గించేందుకు ప్రయోగశాలలో పెంచిన దాదాపు 6,00,000 మగ దోమలను అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వదులుతున్నారు. ఈ దోమల్లో వోల్బాకియా అనే సహజ బ్యాక్టీరియా ఉంటుంది. ఈ మగ దోమలు అడవిలో ఉన్న ఆడ దోమలతో జతకట్టినప్పుడు గుడ్లు పొదగకుండా ఈ బ్యాక్టీరియా అడ్డుకుంటుంది. వాషింగ్టన్ డీసీలోకి వదులుతున్నవి మగ దోమలే కావడంతో అవి మనుషులను కరవవు, రక్తం పీల్చవు.ఈ కార్యక్రమానికి సిల్వర్ స్ప్రింగ్ కేంద్రంగా పనిచేస్తున్న బీ సేఫ్ మస్కిటో కంట్రోల్ సంస్థ నాయకత్వం వహిస్తోంది. ఈ దోమల నియంత్రణ విధానాన్ని అందిస్తున్న అమెరికాలో తొలి ప్రైవేట్ సంస్థగా ఇది నిలిచింది. ఇప్పటివరకు ఇలాంటి కార్యక్రమాలను ప్రధానంగా ప్రభుత్వ సంస్థలు, దోమల నియంత్రణ, పరిశోధనా సంస్థలే నిర్వహించేవి.ప్రస్తుతం ఈ సంస్థ వాషింగ్టన్ డీసీ, మేరీల్యాండ్ ప్రాంతాల్లోని దాదాపు 25 నివాస గృహాలకు సేవలు అందిస్తోంది. పాల్గొనే ప్రతి ఇంటి వెనుక భాగంలో వేసవి మొత్తం ప్రతి వారం సుమారు 1,500 మగ దోమలను విడుదల చేస్తున్నారు. దీంతో గుడ్లు తక్కువగా పొదగడం వల్ల స్థానిక దోమల జనాభా క్రమంగా తగ్గుతోంది.ఈ దోమలను కెంటకీ కేంద్రంగా పనిచేస్తున్న మస్కిటోమేట్ సంస్థ సరఫరా చేస్తోంది. కెంటకీ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన సాంకేతికతతో వోల్బాకియా బ్యాక్టీరియా ఉన్న దోమలను ఈ సంస్థ పెంచుతోంది. విస్తృత స్థాయిలో కీటకనాశకాలు పిచికారీ చేయడానికి బదులుగా ఈ విధానం ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని బీ సేఫ్ చెబుతోంది. ఇది దోమలపైనే ప్రభావం చూపుతుందని, ఇతర కీటకాలు, అడవి జీవులపై ప్రభావం ఉండదని పేర్కొంది. ఈ సంస్థ దోమల నియంత్రణకు ఎర కేంద్రాలు, నిల్వ నీటికి జీవ చికిత్సలు వంటి ఇతర సేవలను కూడా అందిస్తోంది.ఇప్పటికే పలు ప్రాంతాల్లో సక్సెస్ వోల్బాకియా విధానం ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో విజయవంతంగా అమలైంది. ఉదాహరణకు సింగపూర్ దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా బ్యాక్టీరియా సోకిన లక్షలాది మగ దోమలను విడుదల చేసింది. చికిత్స చేసిన ప్రాంతాల్లో దోమల సంఖ్య 90% వరకు తగ్గినట్లు వెల్లడించింది. 2026 చివరి నాటికి దేశంలోని సగం గృహాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని ఆ దేశం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ విధానంపై ఇప్పుడు అమెరికాలో ఆసక్తి పెరుగుతోంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో లక్షలాది వోల్బాకియా బ్యాక్టీరియా ఉన్న దోమలను విడుదల చేసేందుకు నియంత్రణ అనుమతుల కోసం దరఖాస్తు చేసింది. ఇది కూడా ఇలాంటి దోమల నియంత్రణ కార్యక్రమంలో భాగమే.బీ సేఫ్ వ్యవస్థాపకుడు టాడ్ మాంట్గొమెరీ ప్రకారం, ఉత్పత్తి వ్యయాలు, నిర్వహణ సవాళ్లు, నియంత్రణ అడ్డంకుల కారణంగా అమెరికాలో ఈ విధానం విస్తృత స్థాయిలో ఇంకా అమలుకాలేదు. పర్యావరణానికి అనుకూల దోమల నియంత్రణ పద్ధతులపై డిమాండ్ పెరుగుతున్న సమయంలో ప్రైవేట్ సంస్థలు ఈ లోటును భర్తీ చేయగలవని ఆయన అభిప్రాయపడ్డారు.ఉష్ణోగ్రతలు పెరగడం, మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల దోమలు వృద్ధి చెందేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. దీంతో దోమల ద్వారా వ్యాపించే డెంగీ, జికా, వెస్ట్ నైల్ వైరస్ వంటి వ్యాధులపై ఆందోళనలు పెరుగుతున్న సమయంలో ఈ సాంకేతికతపై ఆసక్తి పెరుగుతోంది. -
దోమలను ఎందుకు ఇష్టంగా తింటారు? ఒక టిక్కీకి ఎన్ని దోమలు కావాలి?
ప్రస్తుత కాలంలో మనుషులు దోమల కారణంగా ఇబ్బంది పడినంతగా మరే ఇతర జీవుల వల్ల కూడా ఇబ్బంది పడివుండరంటే అతిశయోక్తి కాదు. సాయంత్రం కాగానే దోమల సైన్యం మన ఇంటిపై దాడి చేసి, కుటుంబ సభ్యుల రక్తాన్ని పీల్చేస్తుంది. ముఖ్యంగా ఇంటికి సమీపంలో నీరు నిల్వ ఉండే ప్రాంతం ఉంటే దోమల దాడి మరింత అధికంగా ఉంటుంది. దోమలను నివారించడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే దోమలను లొట్టలేసుకుంటూ తినేవారి గురించి మీకు తెలుసా? ఇది మీ ఊహలోకి కూడా రాకపోవచ్చు. దోమలను ఎంతో ఇష్టంగా తినే ప్రజలు ఉండే ప్రదేశం ఒకటి ఉంది. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దోమలను లొట్టలేసుకుంటూ తినే ప్రజలు ఆఫ్రికాలో నివసిస్తున్నారు. ఈ సంఘాన్ని మిడ్జెస్ అంటారు. వారు దోమలను వేటాడేవారిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆఫ్రికాలోని విక్టోరియా సరస్సు వర్షాకాలంలో నీటితో నిండినప్పుడు, అందులో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతాయి అప్పుడు మిడ్జెస్ జాతి ప్రజలు ఈ దోమలను వేటాడి, ఇష్టంగా తింటారు. వర్షాల సమయంలో దోమలను పట్టుకునేందుకు ఇక్కడి ప్రజలు పలు రకాల పాత్రలను ఉపయోగిస్తారు. సాయంత్రం పూట దోమలను అధికంగా సేకరించి, వాటిని దగ్గరగా కలిపి, బాగా మెత్తగా చేసి, రుచికరమైన టిక్కీలు తయారు చేస్తారు. పలు నివేదికల ప్రకారం వారు ఒక్కో టిక్కీని తయారు చేయడానికి కనీసం 5 లక్షల దోమలను ఉపయోగిస్తారు. అక్కడ ఒక వ్యక్తి రోజుకు కనీసంగా రెండు టిక్కీలు తింటే, అతను 10 లక్షల దోమలను తిన్నాడని అర్థం. ఈ దోమలు ప్రొటీన్ కారకాలని, వాటిని తింటే తమ శరీరానికి సరిపడా ప్రొటీన్లు లభిస్తాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఇది కూడా చదవండి: ఎత్తయిన భవనాలపై ఎర్ర లైట్లు ఎందుకు? -
డేంజర్ బెల్స్.. భారీగా డెంగీ కేసులు, గుట్టుగా చికిత్సలు!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ భయంతో గత ఏడాది బస్తీల్లో విధిగా హైడ్రోక్లోరైడ్‌తో శానిటైజ్ చేయడం, ఫాగింగ్ నిర్వహించడం వల్ల దోమలు పెద్దగా లేకుండా పోయాయి. ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తే.. సెకండ్ వేవ్‌లో కోవిడ్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఆయా చర్యలు చేపట్టలేదు. దీనికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంటి చుట్టూ ఒకవైపు వరద.. మరోవైపు బురద పేరుకు పోయి డెంగీ దోమల వ్యాప్తికి కారణమవుతున్నాయి. గ్రేటర్లో 2019లో అత్యధికంగా 3366 డెంగీ కేసులు నమోదైతే.. అదే 2020లో కేసుల సంఖ్య 346 తగ్గిపోయింది. తాజాగా ఈ ఏడాది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో అధికారికంగా ఇప్పటికే 250 కేసులు నమోదు కాగా అనధికారికంగా ఒక్కో కార్పొరేట్ ఆస్పత్రిలో పదుల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సంపన్నులు ఎక్కువగా నివసించే బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, శేర్లింగంపల్లి, నానాక్‌రామ్‌గూడ, కూకట్పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతుండటం గమనార్హం. గుట్టుగా చికిత్సలు ఇప్పటికే కరోనా వైరస్ సిటిజన్ల కంటిమీద కునుకు లేకుండా చేస్తుండగా.. తాజాగా డెంగీ దోమలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు తోడు ఇంటి చుట్టు వరద నీరు చేరి దోమలకు నిలయాలుగా మారాయి. – నిల్వ ఉన్న ఈ నీటిగుంతల్లో దోమలు గుడ్లు పెట్టి వాటి సంతతిని మరింత పెంచి పోషిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎప్పటికప్పడు దోమల నియంత్రణ కోసం యాంటిలార్వ, ఫాగింగ్ నిర్వహించకపోవడమే ఇందుకు కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులపై ఎక్కువగా దోమలు దాడి చేస్తుండటంతో ఇటీవల బాధితులు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు. మనిషి రక్తంలో ప్లేట్లెట్స్ 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటాయి. డెంగీ జ్వరం వచి్చనప్పుడు వీటి సంఖ్య తగ్గుతుంది. వీరికి వెంటనే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. చికిత్సల పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులు రోగులను భయభ్రాంతులకు గురిచేసి అత్యవసర చికిత్సల పేరుతో రోజుకు రూ.50 వేలకుపైగా చార్జీలు వేస్తున్నాయి. డెంగీ కేసుల వివరాలను ఏ రోజుకారోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు చేరవేయాల్సి ఉన్నా.. నగరంలోని ఏ ఒక్క కార్పొరేట్ ఆస్పత్రి కూడా ఆ సమాచారం ఇవ్వడం లేదు. అధికారులకు అనుమానం రాకుండా ఉండేందుకు బాధితులను సస్పెక్టెడ్ డెంగీ కేసుల జాబితా లో ఉంచి చికిత్సలు చేస్తుండటం గమనార్హం. -
దోమలపై ‘స్మార్ట్’ ఫైట్
సాక్షి, హైదరాబాద్:మస్కీట్.. ఇది దోమల నివారణ యంత్రం. దోమలు నగరంలో ఏయే ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి.. ఏ రకం దోమ వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి.. అనే వివరాలు తెలుసుకు నేందుకు జీహెచ్ఎంసీ దీన్ని వినియోగించనుంది. క్యాచ్, కౌంట్, క్లాసిఫ్ అనే మూడు పనులను ఈ పరికరం చేస్తుంది. మెషీన్‌లోని సువాసనలతో కూడిన లిక్విడ్, సెన్సర్ల వల్ల దోమలు దీంట్లోకి వస్తాయి. దీంతో ఆయా వాటిలోని దోమలను వర్గీకరించి.. ఫలానా వ్యాధిని కలిగించే దోమలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. తద్వారా సదరు ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టవచ్చు. నిరోధక చర్యలు చేపట్టాక ఏ మేరకు దోమలు తగ్గాయో కూడా తెలుసుకోవచ్చు. నగరంలో జోన్‌కొకటి వంతున దీన్ని వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. దీని వ్యయం రూ.60 వేలని చెప్పారు. -
‘దోమలపై దండయాత్ర’


