గట్టు భీముడికి కన్నీటి వీడ్కోలు | gadwal ex mla gattu bheemudu fornel programme | Sakshi
Sakshi News home page

గట్టు భీముడికి కన్నీటి వీడ్కోలు

Jun 14 2019 5:47 AM | Updated on Jul 11 2019 8:35 PM

gadwal ex mla gattu bheemudu fornel programme - Sakshi

గట్టు భీముడి భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న కేటీఆర్, నిరంజన్‌రెడ్డి

గట్టు: టీఆర్‌ఎస్‌ నేత, గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడికి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బల్గెరలో నిర్వహించిన గట్టు భీముడి అంత్యక్రియలకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరై నివాళులర్పించారు. గట్టు భీముడి కుటుంబానికి పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అండగా ఉంటా మని హామీనిచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మంచి బీసీ నాయకుడిని కోల్పోయిందన్నారు. గట్టు భీముడి సతీమణి భువనేశ్వరి తమ కుటుంబానికి తీరని అన్యా యం జరిగిందని, మాకు న్యాయం చేయాలని కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారం అంతా పూర్తయిన తర్వాత మంత్రి నిరంజన్‌రెడ్డిని కలవాలని, ఆయన ద్వారా మీకు న్యాయం చేస్తామని కేటీఆర్‌ చెప్పారు. అంత్యక్రియల్లో భాగంగా మంత్రి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు ఆంజనేయగౌడ్‌ గట్టు భీముడి పాడెను మోశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, అబ్రహం, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథ«ం, తదితరులు గట్టు భీముడికి నివాళులు అర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement