
సీఎంకు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు
అసెంబ్లీలో తప్పుడు సమాచారం చెప్పినందుకు సీఎం కేసీఆర్‌కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తా మని బీజేపీ శాసనసభాపక్షనేత జీ.కిషన్‌రెడ్డి తెలిపారు.
బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి
శ్రీరాంపూర్: అసెంబ్లీలో తప్పుడు సమాచారం చెప్పినందుకు సీఎం కేసీఆర్‌కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తా మని బీజేపీ శాసనసభాపక్షనేత జీ.కిషన్‌రెడ్డి తెలిపారు. సింగ రేణిలో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నా.. పనిచేయడం లేద ని ఇటీవల సభలో సింగరేణిపై చర్చలో సీఎం తప్పుడు సమా చారం చెప్పారన్నారు.
కిషన్‌రెడ్డి కోల్‌బెల్ట్ యాత్ర గురువారం మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాలో కొనసాగింది. ఈ రెండు జిల్లాల పరిధిలోని బొగ్గుగనుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సమస్యలపై అధ్యయనం చేసి వాటికి పరిష్కారం చూపెడుతూ నివేదిక తయారు చేసి సంస్థ యాజమాన్యానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పిస్తానన్నారు.