సత్య నాదెళ్ల తల్లి అంత్యక్రియలు పూర్తి | Full of the true nadella mother's funeral | Sakshi
Sakshi News home page

సత్య నాదెళ్ల తల్లి అంత్యక్రియలు పూర్తి

Mar 24 2015 3:06 AM | Updated on Sep 2 2017 11:16 PM

సత్య నాదెళ్ల తల్లి అంత్యక్రియలు పూర్తి

సత్య నాదెళ్ల తల్లి అంత్యక్రియలు పూర్తి

మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల తల్లి ప్రభావతి అంత్యక్రియలు హైదరాబాద్ రాయదుర్గంలోని విష్పర్‌వ్యాలీ ‘మహాప్రస్థానం’ శ్మశానవాటికలో సోమవారం జరిగాయి.

హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల తల్లి ప్రభావతి అంత్యక్రియలు హైదరాబాద్ రాయదుర్గంలోని విష్పర్‌వ్యాలీ ‘మహాప్రస్థానం’ శ్మశానవాటికలో సోమవారం జరిగాయి. సత్య నాదెళ్ల తండ్రి యుగంధర్ పర్యవేక్షణలో అంత్యక్రియలను విద్యుత్ దహన వాటికలో నిర్వహించారు. అనారోగ్యానికి గురైన ఆమెను శనివారం శేరిలింగంపల్లిలోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆదివారం అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ల తల్లి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అంత్యక్రియల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్, మాజీ డీజీపీ హెచ్‌జే దొర, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, సత్య నాదెళ్ల కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement