పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితులు | Friends Killed him with petrol | Sakshi
Sakshi News home page

పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితులు

Sep 27 2015 1:18 PM | Updated on Mar 28 2018 11:11 AM

రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఓ యువకుడికి స్నేహితులే నిప్పంటించారు.

రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఓ యువకుడికి స్నేహితులే నిప్పంటించారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. 12 గంటల సమయంలో గొడవ పడుతున్న నలుగురు యువకులను పెట్రోలింగ్ పోలీసులు మందలించి పంపించేశారు. గంట తర్వాత తిరిగి వారు అక్కడకు చేరుకోగా, రాకేశ్ అనే వ్యక్తిపై మిగిలిన వారు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement