చిట్టీల పేరుతో కుచ్చు టోపీ.. | Fraud in the chit fund business | Sakshi
Sakshi News home page

చిట్టీల పేరుతో కుచ్చు టోపీ..

Jan 6 2016 3:38 PM | Updated on Aug 29 2018 4:18 PM

నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లికి చెందిన సైదులు అనే చిట్టీల వ్యాపారి రూ.6 కోట్లకు టోపీ వేసి కుటుంబంతో ఉడాయించాడు.

నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లికి చెందిన సైదులు అనే చిట్టీల వ్యాపారి రూ.6 కోట్లకు టోపీ వేసి కుటుంబంతో ఉడాయించాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి ఉన్న విషయం గమనించిన దాదాపు 800 మంది బాధితులు న్యాయం చేయాలని నల్గొండలోని ఎస్పీ కార్యాలయం వద్ద బుధవారం మధ్యాహ్నం ధర్నా చేశారు. ఎస్పీ లేకపోవడంతో డీఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు.

చిట్టీల పేరుతో మోసగించి ఉడాయించిన సైదులుపై నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 20 సంవత్సరాలుగా నార్కెట్‌పల్లిలో నమ్మకంగా ఉంటూ చీటీల వ్యాపారం చేసేవాడు. 50 వేల నుంచి 2లక్షల రూపాయల వరకూ చీటీలు వేసేవాడు. దాదాపు 6 కోట్ల రూపాయల వరకూ దండుకుని రాత్రికి రాత్రి కుటుంబంతో సహా ఉడాయించాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని నార్కెట్‌పల్లి పోలీసులు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement