
సాక్షి, హైదరాబాద్: నగరంలోని లింగంపల్లిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో లింగంపల్లి రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న ఇంటర్‌సిటీ రైలు ఇంజన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రైలు డీజల్ ఇంజిన్‌కు విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు ఎగసిపడ్డాయి.
మంటలు పెద్ద ఎత్తున చెలరేగడం ఉత్కంఠ రేపింది. అయితే, సకాలంలో స్పందించిన రైల్వే సిబ్బంది మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. తెల్లజారుజామున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.