పత్తిమిల్లులో అగ్నిప్రమాదం | fire accident in cotton mill | Sakshi
Sakshi News home page

పత్తిమిల్లులో అగ్నిప్రమాదం

Jan 17 2015 7:37 PM | Updated on Sep 5 2018 9:45 PM

నల్లగొండ జిల్లా వలిగొండ మండలం నర్సయ్యగూడెం వ ద్ద ఉన్న పత్తిమిల్లులో శనివారం సాయంత్రం అగ్నిపమాదం జరిగింది.

నల్లగొండ జిల్లా వలిగొండ మండలం నర్సయ్యగూడెం వద్ద ఉన్న పత్తిమిల్లులో అగ్నిపమాదం జరిగింది. అయితే ప్రమాదానికి కారణం తెలియలేదు. సాయంత్రం 6.30 గంటల నుంచి మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి.

అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది ఇంకా తెలియలేదు. మంటలు ఎగిసిపడుతుండడంతో చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement