సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పరుపుల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పరుపుల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వెంకటేశ్వర పరుపుల పరిశ్రమలో వివిధ రకాల పరుపులను తయారు చేస్తుంటారు. పక్కనే గల గోదాంలో తయారు చేసిన పరుపులకు ఫినిషింగ్ చేస్తారు. మధ్యాహ్నం భోజన సమయంలో గోదాములో షార్టుసర్క్యూట్ జరగటంతో మంటలు వ్యాపించాయి.
ప్రమాదంలో ఫినిషింగ్‌కు ఉపయోగించే మూడు భారీ యంత్రాలు, వెయ్యి వరకు పరుపులు దహనమయ్యాయి. వీటి విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుందని యాజమాన్యం తెలిపింది. పటాన్‌చెరు, రామచంద్రాపురంల నుంచి శకటాలు వచ్చి మంటలను ఆర్పివేశాయి. బొల్లారం సీఐ సతీష్‌రెడ్డి, ఎస్‌ఐ సాయిరాం, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు పరిశ్రమను పరిశీలించారు. కార్మికులు గోదాము బయట ఉన్నప్పుడు అగ్నిప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదని సీఐ చెప్పారు.