నెలాఖరులోగా ‘ఫీజు’ బకాయిలు | fees dues compleat this month last | Sakshi
Sakshi News home page

నెలాఖరులోగా ‘ఫీజు’ బకాయిలు

Oct 27 2016 2:58 AM | Updated on Sep 4 2017 6:23 PM

నెలాఖరులోగా ‘ఫీజు’ బకాయిలు

నెలాఖరులోగా ‘ఫీజు’ బకాయిలు

ఫీజు రీరుుంబర్స్‌మెంట్ బకారుులను ఈ నెలాఖరులోగా చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్
హైదరాబాద్: ఫీజు రీరుుంబర్స్‌మెంట్ బకారుులను ఈ నెలాఖరులోగా చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల నవంబర్‌లో మంత్రులు, ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీయాలని, ప్రభుత్వాన్ని స్తంభింపచేయాలని బీజేవైఎం కార్యకర్తలకు, విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్ బకారుులు చెల్లించాలని బీజేవైఎం ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు, యువకుల పోరాటాలతో ఏర్పడ్డ తెలంగాణలో వారి హక్కులనే కాలరాచే విధంగా సర్కార్ వ్యవహరిస్తోందని అన్నారు.

కేజీ టూ పీజీ ఉచిత ఆంగ్ల విద్య అంటూ ఎన్నికల హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు కాకమ్మ కబుర్లు చెబుతూ కార్పొరేట్‌కు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు, సిబ్బంది లేరని, రేషనలైజేషన్ పేరుతో దాదాపు 450 పాఠశాలలను మూసివేశారని పేర్కొన్నారు. రెండేళ్లుగా ఫీజు బకారుులు చెల్లించకపోవడంతో 14 లక్షల మంది విద్యార్థులు, రెండు లక్షల యాభై వేలమంది లెక్చరర్లు, సిబ్బంది, 3 వేల కళాశాలల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఆర్థికభారం పేరుతో రీరుుంబర్స్‌మెంటు పథకాన్ని నీరుగార్చడం తగదని సూచించారు. కమీషన్ల కోసం ప్రాజెక్టుల రీడిజైన్ చేసి కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారని, విద్యార్థుల ఫీజు బకారుులు చెల్లించడానికి  సీఎంకు చేతులు రావడం లేదన్నారు.

కేంద్రం నుంచి వస్తున్న వివిధ రకాల నిధులు, స్కాలర్‌షిప్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన పేదలకు ఉన్నత విద్య అవకాశాలు అందించాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీరుుంబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేశారని, దీనితో ఎంతోమంది ఇంజనీర్లు, డాక్టర్లుగా తయారయ్యారని అన్నారు. బకారుులను చెల్లించి బడుగు, బలహీనవర్గాలను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నాయకులు ప్రదీప్, మహిపాల్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి, ప్రధానకార్యదర్శి భరత్‌గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement