కొడుకులే కాడెడ్లుగా.. 

Father Using Son As Bulls To Agriculture Works In Rangareddy - Sakshi

చేవెళ్ల మండలంలోని దేవునిఎర్రవల్లి గ్రామానికి చెందిన  రైతు చీర వెంకటయ్యకు గ్రామంలో  రెండున్నర ఎకరాల భూమి ఉంది. అందులో ఈ ఏడాది పత్తి వేయాలని  నిర్ణయించుకున్నాడు. వర్షాల కోసం ఎదురు చూస్తుండగా శుక్రవారం రాత్రి  విత్తనాలు వేసేందుకు సరిపడా వర్షం పడటంతో వెంకటయ్య సంతోష పడ్డాడు. శనివారం ఉదయం విత్తనాలు వేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే  వెంకటయ్య ఇటీవలే కొనుగోలు చేసిన రెండు ఎడ్లలో ఒక ఎద్దు కాలుకు ఏమి జరిగిందో తెలియదు గానీ కాలు కిందపెట్టలేకపోతోంది. మూడు కాళ్లపైనే నిలబడుతుంది. ఎద్దు నడవలేని స్థితిలో ఉంటే అరక ఎలా కట్టాలని ఆలోచనలో పడ్డాడు. ఆలస్యం చేస్తే భూమిలో మళ్లీ పదను పోతుందని భావించి.. తన కొడుకు, తన తమ్ముని కొడుకు ఇద్దరినీ పత్తి విత్తనాలు వేసే అడ్డకు (అరకకు) కాడెద్దులుగా మార్చాడు. రెండునర్న ఎకరాల భూమిలో ఇద్దరు కొడుకులతో అడ్డకొట్టి విత్తనాలు వేశాడు. రైతు పడే కష్టం మాటల్లో  చెప్పలేనిది అంటే ఇదే.     – చేవెళ్ల: 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top