కూతురు పెళ్లి చేయలేక తండ్రి... | Father commits suicide not able to daugther's marriage | Sakshi
Sakshi News home page

కూతురు పెళ్లి చేయలేక తండ్రి...

Nov 26 2014 1:13 AM | Updated on Aug 16 2018 4:31 PM

పెళ్లీడుకొచ్చిన కూతురుకు వివాహం చేయలేకపోతున్నాననే వేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

సంగెం: పెళ్లీడుకొచ్చిన కూతురుకు వివాహం చేయలేకపోతున్నాననే వేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రాపల్లిలో జరిగిన ఈ ఘటన వివరాలు... గ్రామానికి సౌరం సారయ్య (48)కు కూతురు మాధవి, కుమారుడు రాజేశ్ ఉన్నారు. భార్య సావిత్రి 20 ఏళ్ల క్రితం పిల్లలను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కూలి చేసి సారయ్య పిల్లలను పోషిస్తున్నాడు. కూతురు మాధవి పెళ్లీడుకు వచ్చింది. పెళ్లి చేసేందుకు డబ్బులు లేకపోవడంతో మనస్తాపం చెందిన సారయ్య సోమవారం పురుగుల మందు తాగాడు. వరంగల్ ఎంజీఎంకు తరలించగా, మంగళవారం మృతి చెందాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement