విద్యుత్‌ అధికారుల నిర్బంధం | farmers anger | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ అధికారుల నిర్బంధం

Dec 17 2017 9:58 AM | Updated on Oct 1 2018 2:44 PM

సాక్షి, కథలాపూర్‌ : విద్యుత్‌ బిల్లులు చెల్లించలేదని విద్యుత్ సరఫరా  నిలిపివేడంతో ఆగ్రహించిన రైతులు విద్యుత్‌ అధికారులను ​గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం భూషన్‌రావుపేటలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వ్యవసాయానికి కరెంట్‌ సరఫరా నిలిపివేయడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించమని ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదు. ఆదివారం ఉదయం బిల్లుల వసూలుకు వచ్చిన విద్యుత్‌ అధికారులను గ్రామస్తులు చుట్టుముట్టి పంచాయతీ కార్యాలయంలో వారిని నిర్బంధించారు.

Advertisement
 
Advertisement
Advertisement