నిలిచిన పొగాకు వేలం | Farmers concerned for minimum tobacco prices | Sakshi
Sakshi News home page

నిలిచిన పొగాకు వేలం

Jul 22 2026 4:40 AM | Updated on Jul 22 2026 4:40 AM

Farmers concerned for minimum tobacco prices

కందుకూరు రెండో వేలం కేంద్రంలో ధరలు లేవంటూ రైతుల మండిపాటు

వేలాన్ని అడ్డుకున్న రైతులు

బ్రైట్‌ గ్రేడ్‌ రకం ధరలూ తగ్గించేస్తున్నారని ఆవేదన

కందుకూరు: ఈ ఏడాది పొగాకు వేలం ముందుకు సాగడంలేదు. కనీస ధరల కోసం రైతులు ఆం­దో­ళన చేస్తూనే ఉన్నారు. అయినా ప్రభు­త్వం నుంచి స్పందన లేదు. మంగళవారం ప్రకా­శం జిల్లా కందుకూరులోని రెండో పొగాకు వేలం కేంద్రంలో ధరలు రావడంలేదంటూ రైతులు వేలా­న్ని అడ్డుకున్నారు. లింగసముద్రం మండలంలోని తిమ్మారెడ్డిపాలెం క్లస్టర్‌కు చెందిన రైతులు పొగాకు బేళ్లను వేలం కేంద్రానికి తీసు­కొచ్చారు. వేలం ప్రారంభమైన కొద్దిసేపటికే ధరలను వ్యాపారులు తగ్గించేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు ఇచ్చే వరకు వేలాన్ని ఆపేయాలని డిమాండ్‌ చేస్తూ వేలాన్ని అడ్డుకున్నారు. దీంతో అధికారులు వేలాన్ని  పూర్తిగా నిలిపేశారు. 

ఎ­ఫ్‌2, ఎఫ్‌3 వంటి బ్రైట్‌ గ్రేడ్‌ రకాలకు కూడా క్విం­టాకు రూ.16 వేల నుంచి రూ.17 వేలు మాత్రమే ఇస్తున్నారని, ఈ రకం క్వింటా రూ.20 వేల నుంచి రూ.24 వేల వరకు కొనుగోలు చే­యా­­లని కోరారు. ఇంత తక్కువ ధరలో కనీసం పె­ట్టుబడులు కూడా రావని ఆవేదన వ్యక్తం చే­శా­రు. గిట్టుబాటు ధరల కోసం రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి, అధికారులకు పట్టడంలేదని మండిపడ్డారు. ఇదిలాగే కొన­సాగితే రైతులకు ఆత్మహత్యలు తప్ప మరో దారి లేదని విచారం వ్యక్తం చేశారు. రైతులు, అధికారుల మధ్య చర్చలు ఫలించకపోవడంతో మంగళవారం పూర్తిగా వేలం నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement