రైతు సమస్యల పరిష్కారానికే పాదయాత్ర

Farmer Probles Soveld this Yatra: Bjp - Sakshi

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్‌

సారంగపూర్‌(నిర్మల్‌) : రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే దిశగా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు నుంచి బీజేపీ పాదయాత్ర నిర్వహిస్తున్నామని ఆపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఒడిసెల శ్రీనివాస్‌ తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లో పాదయాత్ర సందర్భంగా ప్రజలు, రైతులతో సమావేశాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయ యాంత్రీకరణ పేరిట రైతులకు అందాల్సిన సబ్సిడీ ట్రాక్టర్లు, ఇతర యంత్రాలు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలకే కేటాయించి రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. స్వర్ణ ప్రాజెక్టు కాలువల ఆధునికీకరణ పనులు పూర్తి చేయకుండా మధ్యలోనే పనులు నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీంతో పాటు రైతు ప్రభుత్వమని చెప్పుకుతిరుగుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు అడుగడుగునా అన్యాయం చేస్తోంద ని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగైదు విడతలుగా రుణమాఫీ చేసి రైతులకు రూపాయికూడా మిగలకుండా చేశారని దుయ్యబట్టారు. ఈవిషయాలన్నీ ప్రజలకు వివరించి ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాన్ని వారికి వివరించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే పాదయాత్ర చేపడుతున్నామన్నారు. రైతు సోదరులు అధికసంఖ్యలో తరలివచ్చి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ మండలాధ్యక్షుడు మైస శేఖర్, నాయకులు అర్జున్, గంగయ్య, ఉమేశ్‌రాథోడ్, సుభాష్‌చౌహాన్, రాకేశ్‌ తదితరులున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top