మోటార్ పైపుకున్న ఫుట్‌బాల్‌ను సరిచేసేందుకు బావిలో దిగిన ఓ రైతు గల్లంతయ్యాడు.
మోటార్ పైపుకున్న ఫుట్‌బాల్‌ను సరిచేసేందుకు బావిలో దిగిన ఓ రైతు గల్లంతయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో శనివారం మధ్యాహ్నం బుచ్చిమల్లు (40) అనే రైతు భార్య కుమారుడితో కలసి పొలానికి వెళ్లాడు. పొలంలోని బావికి ఏర్పాటు చేసిన మోటార్ నీరు తోడకపోయేసరికి దాన్ని సరిచేసేందుకు బుచ్చిమల్లు బావిలోకి దిగాడు. భార్య, కుమారుడు పైన తాడు పట్టుకోగా, దాని సాయంతో లోపలికి దిగిన బుచ్చిమల్లు అరగంట అయినా తిరిగి పైకి రాలేదు. దీంతో వారు కేకలు వేయగా చుట్టుపక్కల రైతులు గాలింపు చర్యలు చేపట్టారు.