విద్యుత్ తీగలు తెగిపడి రైతు మృతి | Farmer dies due to electrocution | Sakshi
Sakshi News home page

విద్యుత్ తీగలు తెగిపడి రైతు మృతి

Jul 23 2015 3:44 PM | Updated on Oct 1 2018 4:01 PM

విద్యుత్ తీగలు తెగిపడి రైతు మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా తానూరు మండలం కోలూరు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

ఆదిలాబాద్ : విద్యుత్ తీగలు తెగిపడి రైతు మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా తానూరు మండలం కోలూరు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కోలూరు గ్రామానికి చెందిన శివమూర్తి తులసీరాం(35) అనే రైతు నీళ్లు పెట్టడానికి పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో విద్యుత్ తీగలు తెగిపడి ఉండటాన్ని గమనించకపోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతునికి భార్య లక్ష్మిబాయితో పాటు ఒక కొడుకు ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement