విద్యుదాఘాతంతో యువ రైతు మృతి | Farmer dies due to electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువ రైతు మృతి

Jul 21 2015 7:11 PM | Updated on Oct 1 2018 4:01 PM

కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం పెర్కపల్లె గ్రామానికి చెందిన యువరైతు లక్ష్మీ రవి(22) పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు.

జగిత్యాల (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం పెర్కపల్లె గ్రామానికి చెందిన యువరైతు లక్ష్మీ రవి(22) పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. తమకున్న ఎకరం భూమిలో వరిపంట సాగు చేస్తున్న రవి మంగళవారం ఉదయం 7 గంటలకు త్రీ ఫేస్ కరెంటు రావడంతో నీళ్లు పెట్టేందుకు మోటార్ ఆన్ చేస్తుండగా షాక్ తగిలి కింద పడిపోయాడు. చుట్టుపక్కల రైతులు గమనించి అతడిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా రవికి తల్లిదండ్రులు లక్ష్మి, లింగన్న, ముగ్గురు అక్కాచెళ్లెల్లు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement