పాముకాటుతో రైతు మృతి | farmer died due to snake bite | Sakshi
Sakshi News home page

పాముకాటుతో రైతు మృతి

Sep 7 2015 11:45 AM | Updated on Oct 1 2018 4:01 PM

పాముకాటుకు గురై ఓ రైతు మృత్యువాత పడ్డాడు.

జైనూరు: పాముకాటుకు గురై ఓ రైతు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా జైనూరు మండలం జమ్‌గామ్ గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కూరేడు మూగేజి(34) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు లాగే వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లిన మూగేజికి ఏదో కుట్టినట్లు అనిపించింది. దీంతో ఆస్పత్రికి వెళ్లాగా.. పాము కుట్టిందని చెప్పిన వైద్యులు చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న మూగేజి మృతి చెందాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement