రైతు కూలీ మృతి | farmer die due to current shock | Sakshi
Sakshi News home page

రైతు కూలీ మృతి

Mar 7 2017 8:18 PM | Updated on Oct 1 2018 4:01 PM

మోటార్‌ మరమ్మతుకోసం బావిలోకి దిగిన రైతు కూలి కరెంట్‌షాక్‌ తగిలి చనిపోయాడు.

గొల్లపల్లి(ధర్మపురి) : మోటార్‌ మరమ్మతుకోసం బావిలోకి దిగిన రైతు కూలి కరెంట్‌కు బలైన సంఘటన జగిత్యాల జిల్లా బొంకూర్‌లో జరిగింది. కూలీకి తీసుకెళ్లిన రైతు సంఘటన స్థలం నుంచి పారిపోవడంతో పరిహారంకోసం మృతదేహంతో అతడి ఇంటి ఎదుట ఆందోళన దిగారు. బొంకూర్‌ గ్రామానికి చెందిన పెద్దపల్లి సత్తయ్య(45)కి భార్య సుజాత, ఇద్దరు కూతుర్లు ఆకాంక్ష, అంజలి, కొడుకు విష్ణువర్ధన్‌ ఉన్నారు. సత్తయ్యకు గుంట భూమి కూడా లేదు. వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఓరుగంటి తిరుపతిరావు రైతు బావి మోటార్‌ (నీటిలో అమర్చింది) పని చేయడం లేదు. మరమ్మతు చేసేందుకు తిరుపతిరావుతో కలిసి బావి వద్దకు వెళ్లగా మోటార్‌ పైకి తీస్తూ మరమ్మతు చేస్తుండగా తిరుపతిరావు ఆన్‌చేయడంతో షాక్‌ తగిలి  సత్తయ్య బావిలో పడి అక్కడిక్కడే మృతి చెందాడు.

తిరుపతిరావు అక్కడి నుంచి జారుకుని ఊరిలో కనిపించకుండా పోయాడు. సత్తయ్య ఇంటికి రాకపోవడంతో రైతు బావి వద్దకు కుటుంబసభ్యులు వెళ్లే సరికి శవమై కనిపించాడు. సత్తయ్య కూతుర్లు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షలు రాస్తుం డగా దూరంకావాల్సి వచ్చింది.  తిరుపతిరావు ఇంటి ముందు సత్తయ్య భార్య, కుటుంబ సభ్యులు గ్రామస్తులు శవంతో ఆందోళనకు దిగారు. పరిహా రం చెల్లించే వరకు ఇక్కడి నుంచి కది లే ది లేదని భీష్మించుకు కూర్చున్నారు.  ఎస్సై ఉపేంద్ర చారి, ధర్మపురి సీఐ శ్రీనివాస్‌ తిరుపతిరావు బంధువులతో మాట్లాడించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తిరుపతిరావు ఆస్తి సత్తయ్య కుటంబసభ్యుల పేరిట రాసి ఇవ్వాలనే డిమాం డ్‌తో సోమవారం రాత్రి వరకు ఆందోళన కొనసాగింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement