గోదావరిఖనిలో నకిలీ పోలీస్ అరెస్ట్ | fake police arrest in godavarikhani | Sakshi
Sakshi News home page

గోదావరిఖనిలో నకిలీ పోలీస్ అరెస్ట్

Nov 28 2016 3:07 AM | Updated on Aug 20 2018 4:27 PM

గోదావరిఖనిలో నకిలీ పోలీస్ అరెస్ట్ - Sakshi

గోదావరిఖనిలో నకిలీ పోలీస్ అరెస్ట్

మద్యం తాగి బిల్లు అడిగిన బార్ యజమానిని తుపాకీ చూపించి పోలీస్ అధికారినంటూ బెదిరించిన కేసులో ఓ నకిలీ...

బొమ్మ తుపాకీ, పోలీస్ డ్రెస్, నకిలీ ఐడీ కార్డు స్వాధీనం

 గోదావరిఖని: మద్యం తాగి బిల్లు అడిగిన బార్ యజమానిని తుపాకీ చూపించి పోలీస్ అధికారినంటూ బెదిరించిన కేసులో ఓ నకిలీ పోలీసును గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. మంథని ప్రాంతానికి చెందిన వేగోళపు శ్రీధర్‌గౌడ్ హైదరాబాద్‌లోని ఫార్మ్‌డ్ లిమిటెడ్ కంపెనీకి నాచారం ఏరియా మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. 2006 నుంచి 2010 వరకు సబ్ ఇన్‌స్పెక్టర్ కావాలని పరీక్షలకు హాజరైనా అర్హత సాధించలేదు. అరుుతే బంధువులకు, స్నేహితులకు తాను ఎస్సైనని, హైదరాబాద్‌లో పనిచేస్తున్నానని నమ్మించాడు. ఇందుకోసం నకిలీ ఐడీ కార్డు తయారు చేరుుంచుకుని పోలీస్ సిరీస్ వచ్చేలా సెల్ నంబర్ కూడా సంపాదిం చాడు.

పోలీస్ యూనిఫాంను కుట్టించుకుని బొమ్మ తుపాకీ(లైటర్)ని కొనుగోలు చేసి అందరిని నమ్మించాడు. ఈ నెల 24న సాయంత్రం గోదావరిఖనిలోని హైకింగ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో శ్రీధర్‌గౌడ్‌తో పాటు అతని స్నేహితులు మద్యం తాగగా.. రూ.4,175 బిల్లు అరుుంది. బార్ యజమాని బొల్గం సురేశ్‌గౌడ్ బిల్లు చెల్లించాలని కోరగా.. ‘తాను కరీంనగర్ క్రైం బ్రాంచ్ డీఎస్పీనని, నన్నే డబ్బులు అడుగుతావా’ అంటూ బొమ్మ తుపాకీని గురిపెట్టి చంపుతానని బెదిరించాడు. బార్‌లో ఉన్న మరో మద్యం బాటిల్‌తో ఉడారుుంచాడు. సురేశ్‌గౌడ్ ఫిర్యాదు చేయడంతో ఆదివారం నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి కారు, బొమ్మ తుపాకీ, పోలీసుడ్రస్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement