భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం | Explosives seized | Sakshi
Sakshi News home page

భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

Oct 24 2015 11:46 AM | Updated on Sep 3 2017 11:25 AM

కరీంనగర్ జిల్లా ధర్మపురిలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

కరీంనగర్ జిల్లా ధర్మపురిలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధర్మపురి శివారులోని ఇద్దరు కార్మికుల ఇళ్లపై పోలీసులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో దాడి చేశారు. వారిళ్లల్లో నిల్వ ఉంచిన 1319 జెలిటిన్ స్టిక్స్, 1002 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. కంచెం మైసయ్య, పురాణి మల్లేశం అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ పేలుడు పదార్థాలను రాళ్లు పగులగొట్టేందుకు వాడుతున్నట్టు తెలిసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement